Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గణనాథుడి నిమజ్జనం పరిసరాలను పరిశీలించిన ఆర్డీవో డి ఎస్ వెంకన్న

Author
Posted By AKSHAYA NEWS
| 23 Sep 2026, 08:52 PM |
గణనాథుడి నిమజ్జనం  పరిసరాలను పరిశీలించిన ఆర్డీవో డి ఎస్ వెంకన్న

గణనాథుడి నిమజ్జనం పరిసరాలను పరిశీలించిన ఆర్డీవో డి ఎస్ వెంకన్న


పరకాల సెప్టెంబర్ 23 అక్షయ న్యూస్:

పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న పరకాల పట్టణంలోని చలివాగు వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, పరకాల తహసీల్దార్ టి. విజయలక్ష్మి, ఎంపీడీవో రామకృష్ణ, పరకాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ప్రవీణ్ కుమార్ విద్యుత్ శాఖ ఏ.డి. దేవేందర్ నాయక్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి