Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పరకాల వంద పడకల ఆసుపత్రిలో ఓపి సేవలు ప్రారంభం

Author
Posted By AKSHAYA NEWS
| 26 Sep 2026, 07:16 PM |
పరకాల వంద పడకల ఆసుపత్రిలో ఓపి సేవలు ప్రారంభం

ప్రైవేటుకు దీటుగా ఆధునిక వైద్య సదుపాయాలు

ఓపి సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి. జిల్లా కలెక్టర్ .మున్సిపల్ చైర్మన్.

పరకాల వంద పడకల ఆసుపత్రిలో ఓపి సేవలు ప్రారంభం - Additional Image

పరకాల సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్:

ఇవి కూడా చదవండి

ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాలలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ సేవలను శనివారం జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయితో కలిసి ప్రారంభించారు. అంతకుముందు ఆసుపత్రి ఆవరణలో గణపతి పూజలో పాల్గొన్నారు.
ఆసుపత్రిలో ఫార్మసీ, జనరల్‌ వార్డు, గైనకాలజీ, ఏఎన్‌సీ, ల్యాబొరేటరీ తదితర విభాగాలను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి సేవలందించారు. ఎమ్మెల్యే స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయించినట్లు చెప్పారు. ప్రస్తుతం 12 విభాగాల్లో సుమారు 27 మంది వైద్యులతో సేవలు అందుతున్నాయని తెలిపారు.వైద్యులు,
సిబ్బంది సమన్వయంతో 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తే ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ఆధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. పరకాల ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ‘ఏ ప్లస్‌’ కేటగిరీకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు
.కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పావుశెట్టి సునీల్‌కుమార్, కమిషనర్‌ పవన్, ఆర్డీవో డీఎస్‌ వెంకన్న, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.