Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

Author
Posted By AKSHAYA NEWS
| 27 Sep 2026, 07:25 PM |
సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

పాల్గొన్న సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావు

హనుమకొండ సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్:

హనుమకొండ ప్రెస్ క్లబ్ నందు సమాచార హక్కు
చట్టం పై అవగాహన సదస్సు గుడిమళ్ళ రవికుమార్ సభాధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా పి. వి. శ్రీనివాస రావు సమాచార హక్కు చట్టం కమీషనర్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాచారా హక్కు పై ప్రజలకు అహగహన ఎంతో అవసరమని ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఉపయోగ పడే ఆయుధం అన్ని దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన వివరించారు, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సు కు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుత వ్వవస్ధలో సమస్సలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి లో ప్రజలు ఉన్నారని ఇలాంటి సదస్సుల వలన సమాచార హక్కు చట్టం ఎంతో దోహద పడుతుందని ఆయన అన్నారు చాలా సందర్బల్లో అధికారులకు సమస్యలు వినే ఓపిక లేకపోవడం బాధకరం అని ఆయన అన్నారు అనంతరం గుడిమళ్ళ రవికుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యం లో ప్రముఖ పాత్ర పోసిస్తుందని దీనిపై అవగాహనా చేయల్సిన అవసరం ఎంతైనా ఉందన్ని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో నేరేళ్ల శోభ,. శ్రీనివాస్ కుమార్, ప్రో. జ్యోతి రాణి, కొలురు వెంకన్న, పెద్ది ఆంజనేయులు, నిమల్ల శ్రీనివాస్, కూతురు సత్యనారాయణ, యం. రమేష్, మండల పరుషరాములు, తది తరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి