Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పరకాలలో సేవా సంకల్ప్ అభియాన్‌లో మెగా రక్తదాన శిబిరం

Author
Posted By AKSHAYA NEWS
| 27 Sep 2026, 08:46 PM |
పరకాలలో సేవా సంకల్ప్ అభియాన్‌లో మెగా రక్తదాన శిబిరం

ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా " పగడాల కాళీ ప్రసాద్ రావు , డా సిరంగి సంతోష్ కుమార్ , డా విజయ చందర్ రెడ్డి

పరకాల సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్:

పరకాలలో సేవా సంకల్ప్ అభియాన్‌లో మెగా రక్తదాన శిబిరం - Additional Image

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాల సేవా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా, బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పున్నం వేణు ఆధ్వర్యంలో పరకాల మున్సిపాలిటీ కార్యాలయం ముందు రెడ్ క్రాస్‌ సొసైటీ ద్వారా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా " పగడాల కాళీ ప్రసాద్ రావు , డా సిరంగి సంతోష్ కుమార్ , డా విజయ్ చంద్ర రెడ్డి, తదితరులు హాజరై రక్తదాతలను అభినందించారు.ఈ సందర్భంగా డా " కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ రక్తదానం అత్యున్నత మానవతా సేవ అని, ఒక యూనిట్ రక్తదానం ఆపదలో ఉన్న ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. సేవా భావంతో ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం – ప్రాణదానం” అనే సందేశంతో నిర్వహించిన ఈ శిబిరం ద్వారా సమాజంలో రక్తదానంపై అవగాహన పెంపొందించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తం అందించే సేవా సంకల్పాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్ పి జయంత్ లాల్ , దేవునూరి మేఘనాథ్, ఎర్ర రామన్న,గురిజాల శ్రీరామ్ రెడ్డి, పరకాల రూరల్ అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ , దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, రాదారపు రతన్ కుమార్ , సంగ పురుషోత్తం, గండు ముకేష్,కొలనుపాక సిద్దు, కక్కు రాజు, మాచబోయిన క్రాంతి, మంద మనోజ్, రాజశేఖర్, గోగుల రాజి రెడ్డి, హరికృష్ణ, కందుల రవి వర్మ, బాణాల శ్రీనివాస్, ఆకుల రాంబాబు, పి రంతు కుమార్, వివిధ మండలాల బిజెవైయం నాయకులు మరియు రక్త దాతలు పెద్ద ఎత్తున పాల్గొనారు

ఇవి కూడా చదవండి