Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విశ్వనాథపురంలో ఫుడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

Author
Posted By AKSHAYA NEWS
| 27 Sep 2026, 09:09 PM |
విశ్వనాథపురంలో ఫుడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

విశ్వనాథపురంలో ఫుడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

హనుమకొండ సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్:

గీసుగొండ మండలం విశ్వనాథపురం గ్రామంలో ఫుడ్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన ప్రాంతాన్ని , వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏ. ప్రియాంక అనిల్ తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.రైతులు, వ్యాపారులు, స్థానిక ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా ఫుడ్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ వసతులు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.ఫుడ్ మార్కెట్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు అందడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం, వ్యాపార కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని అన్నారు.