Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బీజేపీ వినతిపత్రంతో కదిలిన అధికార యంత్రాంగం..

Author
Posted By AKSHAYA NEWS
| 28 Sep 2026, 01:18 PM |
బీజేపీ వినతిపత్రంతో కదిలిన అధికార యంత్రాంగం..

ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు


తహసిల్దార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన బిజెపి నాయకులు

బీజేపీ వినతిపత్రంతో కదిలిన అధికార యంత్రాంగం.. - Additional Image

ఇవి కూడా చదవండి

పరకాల సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్:

పరకాల ప్రభుత్వ భూములు, భవనాలను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ–పరకాల పట్టణ శాఖ చేపట్టిన పోరాటానికి స్పందన లభించింది. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న సర్వే నంబర్ 950లోని ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 తేదీన పరకాల ఎమ్మార్వో కు బిజెపి నేతలు వినతిపత్రం సమర్పించడం జరిగింది బీజేపీ సమర్పించిన వినతిపత్రంపై స్పందించిన పరకాల ఎమ్మార్వో సంబంధిత ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి, అక్కడ ప్రభుత్వ స్థలానికి సంబంధించిన హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయించారు.బీజేపీ లేవనెత్తిన ప్రజా సమస్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును బీజేపీ పరకాల పట్టణ శాఖ నాయకులు సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు భవిష్యత్‌లో ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.ప్రజల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, వాటికి పరిష్కారం లభించే వరకు నిరంతరం కృషి చేయడమే బీజేపీ పరకాల పట్టణ శాఖ లక్ష్యమని బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ తెలిపారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంపై బాధ్యతాయుతంగా స్పందిస్తూ ప్రజల పక్షాన బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వ స్థల పరిరక్షణకు చర్యలు తీసుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించిన పరకాల తహసీల్దార్‌ కు బీజేపీ పరకాల పట్టణ శాఖ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.పి. జయంతీలాల్, పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, పరకాల సింగిల్ విండో వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు వేముల సధారాణి, పట్టణ ఉపాధ్యక్షుడు మిడిదొడ్డి నరేష్, ప్రధాన కార్యదర్శులు సంఘ పురుషోత్తం, ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఉడుత చిరంజీవి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి కృష్ణ ప్రసాద్, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ మెంతుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.