Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

Author
Posted By AKSHAYA NEWS
| 29 Sep 2026, 03:12 PM |
మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి


హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు - Additional Image

ఇవి కూడా చదవండి

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మత్తు పదార్థాల దుష్ప్రభావం పై అవగాహన


యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిఅన్నారు.
మంగళవారంహనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కొంతమంది యువత సరదా, స్నేహితుల ప్రభావం, ఆసక్తి వంటి కారణాలతో మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఒకటి రెండు సార్లు తీసుకుంటే ఏమవుతుందనే నిర్లక్ష్య ధోరణి ప్రమాదకరమని, అదే క్రమంగా వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సంచాలకులు ఆచార్య ఈసం నారాయణ మాట్లాడుతూ... జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవా భావన, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎన్. రెహమాన్ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. నార్కోటిక్ ఇన్‌స్పెక్టర్ కుమార్‌స్వామి మాట్లాడుతూ... మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన, ఆరోగ్యపరమైన, సామాజిక పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీలత, డాక్టర్ రమేష్, డాక్టర్ చందర్, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.