Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కైలాపూర్ శివారులో 2.4 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

Author
Posted By AKSHAYA NEWS
| 05 Oct 2026, 07:41 PM |
కైలాపూర్ శివారులో 2.4 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించిన  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల అక్టోబర్ 05 అక్షయ న్యూస్ :

చిట్యాల మండల కేంద్రంలోని కైలాపూర్ శివారులో ఏర్పాటు చేసిన 2.4 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సొమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచేందుకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఎంతో దోహదపడతాయని అన్నారు. సౌర విద్యుత్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ అవసరాలను తీర్చుకోవచ్చని పేర్కొన్నారు సోలార్ విద్యుత్ తో విద్యుత్ కొరత లేకుండా ఉంటుంది అని అన్నారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దబ్బెట అనిల్ సర్పంచ్ కొడారి అశోక్ బుర్ర శ్రీనివాస్ గడ్డం కొమురయ్య కొర్రి సాంబశివుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.