Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అరోరా డిగ్రీ కళాశాలలో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

Author
Posted By AKSHAYA NEWS
| 09 Oct 2026, 07:16 PM |
అరోరా డిగ్రీ కళాశాలలో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

అరోరా డిగ్రీ కళాశాలలో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

హనుమకొండ, అక్టోబర్ 9 అక్షయ న్యూస్

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు హనుమకొండలోని అరోరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు.కళాశాల ఆవరణలో విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, చుట్టూ కోలాటాలు వేస్తూ ఆడి పాడారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ & ప్రిన్సిపాల్ పాగాల రఘోత్తమ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, విద్యార్థుల్లో సంప్రదాయాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని అన్నారు. అనంతరం అధ్యాపకులను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రణవ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రజిని, అధ్యాపకులు అశోక్, సతీష్, సంతోష్, రమేష్, సుమలత, జమాల్, ప్రవీణ్, శివకుమార్, రాజు, అంకిత, రత్నాకర్ రెడ్డి, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి