Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యువత ఆన్లైన్ మోసాల బారిన పడొద్దు

Author
Posted By AKSHAYA NEWS
| 09 Oct 2026, 08:23 PM |
యువత ఆన్లైన్ మోసాల బారిన పడొద్దు

కుటుంబ సభ్యులందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించండి.

వరంగల్ సీపీ. ఎన్. శ్వేత, ఐపీఎస్


హనుమకొండ ప్రతినిధి అక్టోబర్ 9 అక్షయ న్యూస్

ఇవి కూడా చదవండి

:డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని తమ విలువైన భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు.శుక్రవారం హనుమకొండ భీమారంలోని ఎస్వీఎస్ కళాశాల ఆడిటోరియంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోయే వ్యక్తులు మీరేనని, ప్రస్తుతం మీరు ఉన్న వయస్సు జీవితానికి అత్యంత కీలకమైన దశ అని పేర్కొన్నారుప్రస్తుతం సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదని సూచించారు. కొందరు సైబర్ నేరగాళ్లు భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బాధితులను బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, కేయూసీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ అశోక్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ శివకుమార్, ఎస్వీఎస్ కళాశాల అధ్యాపకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.