Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భూముల రీసర్వేతో సమస్యలకు పరిష్కారం

Author
Posted By AKSHAYA NEWS
| 09 Oct 2026, 08:59 PM |
భూముల రీసర్వేతో సమస్యలకు పరిష్కారం

పరకాల మండలం కామారెడ్డిపల్లి లో భూ రీసర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్

పరకాల అక్టోబర్ 9 అక్షయ న్యూస్

భూముల రీసర్వేతో సమస్యలకు పరిష్కారం - Additional Image

భూముల రీసర్వే తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.శుక్రవారం హనుమకొండ పరకాల మండలం కామారెడ్డిపల్లిలో చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన భూముల వివరాలు, ఇప్పటివరకు చేపట్టిన రీసర్వే పురోగతి గురించిన వివరాలను సర్వేయర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులతో అదనపు కలెక్టర్ మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ.. భూముల రీ సర్వే వేగవంతంగా సాగాలని సర్వేయర్లకు సూచించారు. రీసర్వే విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతులు అధికారులకు, సర్వే సిబ్బందికి సహకరించాలన్నారు. గ్రామంలో తదుపరి ఏయే రైతుల భూముల్లో రీసర్వే జరుగుతుందనే సమాచారాన్ని ముందస్తుగా సంబంధిత రైతులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా పరకాల ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, సర్వేయర్ విజయ్ కుమార్, ఇతర అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి