Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నాగారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Author
Posted By AKSHAYA NEWS
| 10 Oct 2026, 09:12 PM |
నాగారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో - బంగారు బతుకమ్మ ఉయ్యాలో - ఆటపాటలతో సంబరాలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు

మేజర్ గ్రామపంచాయతీ నాగారంలో తొలిరోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి..

తొలి రోజు బతుకమ్మ సంబరాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన సర్పంచ్. .

ఇవి కూడా చదవండి


పరకాల అక్టోబర్ 10 అక్షయ న్యూస్:


తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు పరకాల మండలం నాగారం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయక పాటలతో ఆడుతున్న ఉత్సవాల్లో ఆయన కాసేపు గడిపారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ పెళ్లిరోజు బతుకమ్మ శుభాకాంక్షలు గ్రామ సర్పంచ్ ఏరుకొండ రమాదేవి శ్రీనివాస్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అస్తిత్వానికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ఒక నిదర్శనం. ప్రకృతిని పూజించే ఇలాంటి గొప్ప పండుగను మనమంతా కలిసికట్టుగా జరుపుకోవడం సంతోషకరం. నాగారం గ్రామ ప్రజల జీవితాల్లో ఈ బతుకమ్మ పండుగ సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇల్లూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు