Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలి..

Author
Posted By AKSHAYA NEWS
| 11 Oct 2026, 05:50 PM |
లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలి..

ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు

నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం:

లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలి.. - Additional Image

పరకాల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా వేముల ఆంజనేయులు చిలుకమారి మొగిలి, యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా దాసరి రవి దేవులపల్లి సతీష్ కుమార్, మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా కడారి అమరావతి దాసరి పద్మ, పోపా అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ పి రాజేశ్వరప్రసాద్, దుంపేటి నాగరాజు, కోశాధికారిగా పల్నాటి సతీష్

ఇవి కూడా చదవండి

పరకాల అక్టోబర్ 11 అక్షయ న్యూస్:

దేశ స్వాతంత్రం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తన జీవితాన్ని ధారబోసిన స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు కల్పించాలని మాజీ శాసనసభ్యులు, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు వన్నాల శ్రీరాములు కోరారు. ఆదివారం నాడు పరకాల పద్మశాలి భవన్ లో జరిగిన పట్టణ పద్మశాలి సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ మెండు రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రీరాములు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కుల వృత్తుల సహకార సంఘాల ఏర్పాటులో బాపూజీ కీలక పాత్ర పోషించారన్నారు. బాపూజీని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని, ఆయన కూతురు డాక్టర్ పవిత్ర వాణిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని శ్రీరాములు కోరారు. ఇంకా ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు వడ్నాల. నరేందర్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం రాష్ట్ర సహాయ కార్యదర్శులు వెంగళ వేణుగోపాల్ పులికంటి రాజేందర్ జిల్లా కార్యదర్శి కేదాసీ వెంకటేశ్వర్లు, వేముల సదానందం,పరకాల పద్మశాలి సంఘం నాయకులు డాక్టర్ పి రాజేశ్వరప్రసాద్ డాక్టర్ మంత్రి కాశయ్య చిదురాల దేవేందర్ బాసని దయాకర్ రాచర్ల అశోక్ మెరుగు శ్రీనివాస్ దాసరి బిక్షపతి దార్న వేణుగోపాల్, స్థానిక న్యాయవాది జి. సదా రాణి తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గాలు...

పరకాల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా వేముల ఆంజనేయులు చిలుకమారి మొగిలి, యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా దాసరి రవి దేవులపల్లి సతీష్ కుమార్, మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా కడారి అమరావతి దాసరి పద్మ, పోపా అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ పి రాజేశ్వరప్రసాద్, దుంపేటి నాగరాజు, కోశాధికారిగా పల్నాటి సతీష్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నూతన కార్యవర్గాల చేత జిల్లా బాధ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు.