Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పైడిపల్లిలో నూతన విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు..

Author
Posted By AKSHAYA NEWS
| 16 Oct 2026, 09:25 PM |
పైడిపల్లిలో నూతన విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు..

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తాం..

ఏడీఈ దేవేందర్‌

పరకాల, అక్టోబర్‌ 16: అక్షయ న్యూస్

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశాల మేరకు పైడిపల్లి గ్రామంలో నూతన విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి లైటింగ్‌ పనులు చేపట్టినట్లు పరకాల ఏడీఈ (ఆపరేషన్‌) దేవేందర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ సరఫరాలో అంతరాయాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే సంబంధిత సిబ్బంది వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు, గృహ, వాణిజ్య వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు. వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని, సమస్యలు ఎదురైతే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఏడీఈ దేవేందర్‌ సూచించారు.