Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పాడి గేదెల పెంపకంతో కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

Author
Posted By AKSHAYA NEWS
| 27 Sep 2026, 09:04 PM |
పాడి గేదెల పెంపకంతో కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం


ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పాడి గేదెలను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి

పాడి గేదెల పెంపకంతో కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి - Additional Image


హనుమకొండ సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్:

ఇవి కూడా చదవండి

ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పాడి గేదెలను ఆదివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...పాడి గేదెల పెంపకం ద్వారా లబ్ధిదారులు నిరంతర ఆదాయం పొందుతూ తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచు
కోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా దామెరలో మహిళలతో పరకాల ఇందిరా మహిళా డైరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.పాడి గేదెలను సక్రమంగా సంరక్షిస్తూ, పాడి ఉత్పత్తిని పెంచుకొని అదనపు ఆదాయం పొందాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు