Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి

Author
Posted By AKSHAYA NEWS
| 29 Sep 2026, 05:32 PM |
పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి

మోదీపై, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు సహించం


పరకాల సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్:

పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి - Additional Image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల మార్కెట్ సర్కిల్ వద్దసీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
ఎన్. రామచంద్ర రావు పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్
నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా గాజుల నిరంజన్ మాట్లాడుతూ.. దేశ ప్రధానిపై రాజకీయ విమర్శలు చేయడం ఒక విషయం, కానీ కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరాముడు, పరమశివుడి వంటి దేవతలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు.ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలకు స్థానం ఉందని, అయితే హిందూ దేవతలను రాజకీయ వ్యాఖ్యలకు వేదికగా మార్చడం సమంజసం కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉంటుందని, ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ సంయమనం పాటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పరకాల కౌన్సిలర్స్ కుక్కల విజయ్ కుమార్,ఆకుల లావణ్య శ్రీధర్, జిల్లా కోశాధికారి ఎర్ర రామన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి సంగా పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి,మాజీ అధ్యక్షులు మార్త బిక్షపతి, కానుగుల గోపీనాథ్, కార్యదర్శి దారుణ సునీల్, కుమార్ ఆకుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి