Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. బీజేపీ నాయకులు సిద్ధమా..?

Author
Posted By AKSHAYA NEWS
| 11 Oct 2026, 04:58 PM |
అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. బీజేపీ నాయకులు సిద్ధమా..?

ఖబడ్దార్ బీజేపీ నాయకులారా...

కేసీఆర్ పాలనలోనే ప్రజలకు చేరువైన పరిపాలన

అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. బీజేపీ నాయకులు సిద్ధమా..? - Additional Image

పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది


పరకాల అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నాయకులకు ఉందా..

ఇవి కూడా చదవండి


పరకాల అక్టోబర్ 11 అక్షయ న్యూస్:


అదివారం పరకాల పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది .ఈ సమావేశంలో వారు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 33 జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు.గతంలో జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, దూరప్రాంతాల నుంచి కలెక్టరేట్ కార్యాలయాలకు చేరుకోవడానికి ఎంతో సమయం, డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు, ప్రభుత్వ శాఖలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించిన కేసీఆర్ గారి సేవలకు కృతజ్ఞతగా జిల్లా కేంద్రాల్లో ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.పరకాల నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విశేష కృషి చేశారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, వైద్య సదుపాయాల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు.


అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. బీజేపీ నాయకులు సిద్ధమా?

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని నాయకులు అన్నారు. రాజకీయ విమర్శలు చేయడం సులభమే కానీ, ప్రజలకు చేసిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడటం ముఖ్యమని హితవు పలికారు.ఖబడ్దార్ బీజేపీ నాయకులారా! పరకాల నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే ముందు గతంలో జరిగిన అభివృద్ధిని గుర్తించండి. ప్రజలకు ఎవరు ఏమి చేశారో ప్రజాక్షేత్రంలో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా ధైర్యం ఉంటే అభివృద్ధిపై చర్చకు రండి.
పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ స్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు